తెలంగాణ పదో తరగతి విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. ఫలితాలను సాధ్యమైనంత త్వరగా విడుదల చేసేందుకు విద్యాశాఖ పనులు వేగవంతం చేసింది. ఏప్రిల్ 16న పరీక్షలు ముగియగా మూల్యాంకన ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది.
కీలక సబ్జెక్టుల వాల్యుయేషన్ పూర్తి:
మొదటి విడతలో చేపట్టిన తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టుల జవాబు
పత్రాల మూల్యాంకనం ఇప్పటికే విజయవంతంగా పూర్తయింది. మిగిలిన సైన్స్, సోషల్
సబ్జెక్టుల మూల్యాంకనంతో పాటు స్కానింగ్ ప్రక్రియను ఈ నెల 25వ తేదీలోపు
పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
మే 4 లేదా 5న విడుదల?
సబ్జెక్టుల వారీగా మూల్యాంకనం పూర్తయిన వెంటనే మార్కుల క్రోడీకరణ
(ట్యాబ్యులేషన్) ప్రక్రియను అధికారులు వేగవంతం చేయనున్నారు. తాజాగా బోర్డు
అధికారులు నిర్వహించిన సమీక్షా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. మే
మొదటి వారంలోనే ఫలితాలను ప్రకటించనున్నారు. సాంకేతిక పరమైన ఇబ్బందులు
లేకుంటే మే 4 లేదా 5వ తేదీల్లో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
Komentar
Komentar ditutup untuk artikel ini.